Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీ.ప
అంధ విశ్వాసాలు యవినీతియక్రమం
అంతమొందించగ అలుపెరుగడు
సంధి విగ్రహములు కందుకూరి ముగించె
సాహితీ సేవయు సంఘసేవ
నూట ముప్పది తెల్గునాట గ్రంధాలను
సాహితీ ప్రక్రియలు సాధనముగ
హితకారిణీ సతీ హిత బోధినీలను
నవల ప్రహసనాలు కవనరీతి!
ఆ.వె
స్త్రీల విద్య కొఱకు శ్రీకారమును జుట్టి
గద్య తిక్కనార్యు ఘనతబొంది
బాలికలకు విద్య బాల సాహితి సేవ
తెలుగు పండితునిగ వెలిగెనితడు!
-శశికళ.బి