Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీ.ప
ప్రాణ దానము జేయ పరమాత్మ పంపించ
దివినుండి దిగివచ్చె యవనిపైకి
తన యింట బాధ్యత మన కొఱకునొదలి
త్యాగ నిరతి తోడ తపన చెందు
యిహ లోక సౌఖ్యాలు యెన్నైన వదిలేసి
యమునితో పోరాడనవతరించె
ఆరాధ్య దేవుళ్ళు అభినందననీయులు
వైద్య ధన్వంతరి వచ్చె భువికి!
ఆ.వె
వైద్య శాస్త్రమందు వజ్ర సంకల్పులు
మధుర హృదయమున్న బుధులువీరు
అర్హమైన విద్య అంకిత భావము
అవనియందు జనులనాదరించ!
- శశికళ