Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీ.ప
తెల్లనీ దుస్తులు మల్లెల్ని తలపిస్తు
ఉదయాన పూవులా యెదను మీటె
చీకటీ చీల్చేటి చిన్ని దీపము వంటి
చిరు నవ్వుతో దేవి చేరవచ్చె
మేఘాన్ని చీల్చేసి మెరిసేటి మెరుపులా
మురిపించు నగుమోము ముచ్చటేన
కదిలించె హృదయాన్ని కడసారి నీ నవ్వు
వడలిన పువ్వులా వంచనేన!
ఆ.వె
విద్యలోన రాణి వైద్య శిఖామణి
ప్రాణమిచ్చె నేడు ప్రజల కొఱకు
నాదు ప్రాణమిత్తు నన్ను తీసుకు వెళ్ళు
హృదయమున్న దేవ వదలి వెళ్ళు!
- శశికళ.బి