Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీ. ప
ప్రాణమునిలుపగ ప్రాణాలకు తెగించి
యుద్ధమునకు మీరు సిద్ధపడిరి
ఒంటరై మేమంటె జంటగా మీరుండి
కంటి రెప్ప వలెను కాంచినారు
కోవిడ్డు నైంటీను ఆవహించక మమ్ము
కూరుచుండిరి మీరు కునుకు లేక
కడుపు తీపి నొదిలి కన్న వారి నొదిలి
విడువక మాతోడ కడవరకును!
ఆ.వె
మాకు వచ్చి నట్టి మాయదారి కరోన
అంటు రోగమయ్యి ఆవహించె
ఆలు బిడ్డలంత ఆరాట పడినను
ఆదరించె వైద్యులార్తి తోడ!
- శశికళ.బి