Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శశికళ.బి
విజ్ఞానమందు యెదిగి
వివేకమెంతొ నేర్చుకుని
విధి వైపరీత్యానికి
వెళ్ళకిలా పడ్డావు!
అహంకారమొదిలి పెట్టి
అందరికోసం బతికి
ఆనందం పంచుతూ
హాయిగా జీవించు !
అందరిలో జీవితేచ్చ
అలాగే ఉండునన్న
అక్షర సత్యం తెలుసుకో
పరిశుభ్రత పాటిస్తూ
పచ్చదనం పెంచుతూ
ప్రకృతినీ ప్రేమిస్తూ
ప్రయాణించు ఓ మనిషీ
పరిస్థితి అదే చక్కబడును!