Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆళ్ల నాగేశ్వరరావు, తెనాలి
7416638823.
గాన గంధర్వుడు
నెల్లూరు నగరంలో
ఉన్నత కుటుంబంలో జన్మించి
సంగీత సాధనను కొనసాగించి
పాడుతా తీయగా అంటూ
సుస్వ ర గీతాలను ఆలపించి
ఎందరో వర్ధమాన గాయకులను
ప్రోత్సహిస్తూ
వారికి మార్గదర్శియై నిలుస్తూ
ఎదిగే కొద్దీ ఒదిగి ఉంటూ
ప్రపంచదేశాల్లో తెలుగు గళలను వినిపిస్తూ
గాయకుడిగా, నటుడిగా, దర్శకుడుగా, రచయితగా
బహుముఖ ప్రజ్ఞా పాఠవాన్ని
ప్రదర్శిస్తూ
ఆ బాలగోపాలాన్ని తన
గాన మా ధుర్యంతో
పరవశింపచేసిన గాన గంధర్వుడు
పండితారాధ్యుల యస్.పి.
బాలసుబ్రహ్మణ్యం గారి
మృతికి అశ్రునివాళులు!
(గాన గంధర్వుడు యస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారి మృతికి నివాళులు ఆర్పిస్తూ.....)