Authorization
Mon Jan 19, 2015 06:51 pm
---సుజాత.పి.వి.ఎల్,
సైనిక్ పురి,సికిందరాబాద్.
7780153709
సుమధుర గాన సంద్రం నిశ్చేతనమయింది..
ఆటపాటలతో అందరినీ అలరించిన 'బాలు'డి
అల్లరి చేష్టలు లేక
సంగీత వాయిద్యాలు మూగబోయాయి..
శంకరా నాద శరీరాపరా..అని అమృతాన్ని పంచిన స్వరం..శివ సాన్నిధ్యాన్ని పొందింది..
కోటాను కోట్ల ప్రజల హృదయాల్లో..సుస్థిర స్థానాన్ని నిలుపుకున్న ఆ స్వరం..స్వర్గం చేరుకుంది..
ముఖంపై ఎన్నడూ చెరగని చిరునవ్వుతో..
పసి'బాలు'డిలా..'మళ్ళీ నే తిరిగొస్తాన'ని చివరి సారి మాటలు..తలచుకుంటుంటే..
నాడు అమృతం కోసం చేసిన పోరులో..నీ గానామృతాన్ని పొందేందుకు నేడు దేవతలు పన్నిన పన్నాగం అనిపిస్తుంది..
అవునులే..నువ్వు దివిలో విరిసిన పారిజాతానివి..
మమ్మునలరించేందుకు 'తరలిరాద తనే వసంతం' అంటూ మా కోసం భువికి దిగి వచ్చిన గాన గంధర్వుడివి..
'ఒక్కడై రావడం'..అని పాటతో వేదాంతాన్ని తెలిపిన బ్రహ్మజ్ఞానివి..
'అంతర్యామి అలసితి సొలసితి' అంటూ..అనంత లోకాలకు తరలిపోయిందా ఆ స్వరం..!
తలచుకుంటేనే గుండె పిండేస్తుంది..
నీవు లేని లోటు ఎవరు తీర్చలేనిది..బాలూ!!!!
(-అశృ నయనాలతో..)