Authorization
Mon Jan 19, 2015 06:51 pm
--అయిత అనిత
8985348424
అద్వైతసిద్ధికి అమరత్వలబ్దికి
గానమే సోపానమంటివి కదా!
మరెలా నిను దరిచేరెను ఆ మరణమయ్యా..?
మాటేరాని చిన్నదానితో
పెదాలలో రాగాలను పల్లవింపజేసితివి కదా!
మరి నీ మాటకు ఈ మౌనమేళనయ్యా..?
నేనుసైతం విశ్వముక్తి వెర్రిగొంతుక ఇచ్చిమ్రోశానంటివి
ఆ గొంతుక ఇప్పుడే
స్వర్గానికి ఏల పయనమాయెనయ్యా..?
శంకరా నాదశరీరాపరా వేదవిహారా హరా అంటూ
గానమేనీదని ప్రాణమేనీవని
ఆ నీలకంఠుని సేవకై స్వర్గపురికి ఏగితివా?
ఎలా నమ్మేది?
నువ్విక లేవంటే..నీ పాటిక వినరాదంటే
ఎలా నమ్మేది?
చెట్టు పుట్ట..గాలి నీరు..నేల నింగి
ఎటు చూసినా
నీ రూపమే..ఏ సడి విన్నా నీ స్వరమే
పాటగా నువ్వు అమరుడవయ్యా!