Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బి.శశికళ
పాఠశాల సహాయకులు, సోంపేట, శ్రీకాకుళం,
8500269783
సీ.ప
సాటిరాని ఘనుడు సంగీతశాస్త్రాన
సామవేదమునంత చదివినాడు
తీయని గమకాలు తేనె సరాగాలు
తెలుగు భాష వెలుగు తేనెలొలుకు
ఆధ్యాత్మికానందమాపాత మధురమ్ము
అణువణువున నిండు నతని వాణి
కరుణాది రసములు కురిపించు వరపుత్ర
నిరతము పాటతో పరవశించు
ఆ.వె
నీదు గానమహిమ నిండునూరేళ్లుండు
నారదాది హనుమ నాద నిధులు
వీణ గాన గాత్ర గానగంధర్వుడా
తెలుగు నాడి వాడి తెలుపు వాడ!
ఆ.వె
బాలసుబ్రమణ్య భాసించె భానుడై
భరతమాతపుత్ర వరము నీవు
మధుర గానసుధలు మంగళ కరములు
అందుకొనుము వేల వందనములు!