Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సబ్బు నాగయ్య ప్రజాకవి, రాజుపేట
9573996828
ఎన్ని జన్మల పాపమో...
ఎన్నెన్ని తరాల శాపమో "కోవిద్" రూపాన
మనిషికి బతికుండగా "నరకం" చూపుతుంది
అపార జ్ఞాన సంపన్నునని విర్రవీగినోన్ని
వెర్రి వెంగలప్పను జేసీ ఆటాడుకుంటుంది
విశ్వంతరాల "గుట్టు' రట్టుజేస్తానని తొడగొట్టినోన్ని
నిశబ్ద నిశిధిలో "ఏకాకి"గా నిలబెట్టింది
ఆకాశానికి హద్దులు గీస్తానని మీసం మెలేసినోన్ని
అధః పాతాళంలో తొక్కి పెట్టింది
చంద్రునిపై "ఇంద్ర ప్రస్టం"కడతానని కలగన్నోనికి
భూమ్మీద నూకలకు చెల్లు చీటి రాసింది
"జీనోమ్" పేజీల తిరగేస్తానని తలెగరేసినోనికి
తన "అస్తిత్వం" ప్రశ్నార్థకం చేసింది
పంచభూతాలపై పెత్తనమంటు రొమ్ము విరిచినోనికి
చిరునామా గల్లంతు జేసింది
రాజ్యాలకు రారాజునని మురిసినోనికి
ఆరడగుల "జాగ"కూడా దూరం చేసింది
కోవిద్ కు ధనిక బీద, రాజు,బంటు తేడాలేదేమో!
అందుకే అందరిని ఒకే గాటన కట్టిపడేసింది
మూకుమ్మడిగా "మృత్యు" నోట్లోకి నెట్టేసింది
"కరోనా"కెంత కసి లేకుంటే...
అయినవాళ్ళు పలకరించనంతగా
కడసారి హత్తుకు దుక్కించలేనంతగా
ఖననానికి కూడా నోచుకోలేనంతగా…,
కుక్కల కన్నా హీన "చావు" రుచి చూపుతుంది
ఏతా వాతా "కరోనా" తేల్చిందేమంటే
ఈ అనంత విశ్వంలో…,
కోటాను కోట్ల జీవరాశుల్లో…,
మనిషన్నవాడు ఓ "బుద్ది" జీవి మాత్రమేననీ..!