Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పుడమి తల్లి
పురిటి నొప్పుల బాధను
వలపు రగిలించే..
ప్రేమ జంట పాటను..
ఎవరు పాడగలరు..!!
పక్షుల పలకరింపులు..
ప్రకృతి అందాల..
పులకరింతలు..
మనసుకు ఇంపుగా
ఎవరు ఆలపించగలరు..!!
అణువణువును కదిలించి
కొత్త రాగాల భావాలను పుట్టించి
మధురంగా వినిపించే
సుమధుర గాయకుడే..!!
మేఘాన్ని మురిపించి
చినుకును పుట్టించి..
నదులవైపు నడిపించి
బంగారు పంటలు పండించే..
పైరుపచ్చల పాట
ఎవరు పాడగలరు..!!
ఒక గాన గంధర్వుడే..!!
అందమైన తీరాలను
అనురాగ రూపాలను..
పిల్ల తెమ్మర పిలుపులను
కులుకు తలుకుల పాటను
ఎవరు వినిపించగలరు..!!
అశ్రుదారలోని ఆర్ద్రతను
చమటచుక్కల శ్రమత్వాన్ని
కర్షకుల ఆకలిమంటల
కార్మికుల కాలినడకల..
పాట ఎవరు పాడగలరు..??
ఒక మధురగాయకుడుతప్ప...!!
కాలాన్ని కదిలించి
అందమైనగీతాలను వినిపించి
తాపాలు పాపాలను నేట్టేసే..!!
గీతాలను ఎవరు వినిపిస్తారు..??
రగిలే వేదనలు రోదనలు
ఎవరు చూపగలరు..?
దేవుళ్లను ఒప్పించాలన్నా..!!
దేవుళ్ళందరు దివినుంచి..
భువికి దిగిరావాలన్న..!!
గుళ్లలో గంటలు మోగాలన్న..!!
భక్తులు పరవసించి ఆడాలన్న..!!
ఆ మధురగాయకుని
పాటలు కావాలి...
ఓ కాలమాఎక్కడినుంచి
తెస్తివయ్యా.. ఈ కరోనాను
కనికరం లేకుండ కమ్మని
స్వరగాయకుని
పొట్టన పెట్టుకున్నది....
ఇప్పుడు ప్రకృతి తడారిపోయింది..
కళామతల్లి కంట నీరు బెట్టుకున్నది..!!
తెలుగు పదాలను అలవోకగా
పలుకుతూ కమ్మని పాటగ వచ్ఛేది..
అతడొక సరస్పతి పుత్రుడు..
పాడుతా తీయగాలో క్రొంగొత్త ..!!
గాయకులకు ఊపిరి పోసి
వాళ్లకు ఊతమై నిలబడ్డాడు
బాలు పాట నిత్యం జాలు వారు..!!
ఎందరెందరికో చేయూతనిస్తూ..
చేరదీస్తూ చైతన్యం నింపేవాడు..
ఇలాంటి గాయకుడు..
రాడు రాబోడు..అతడో కారణజన్ముడు..!!
అంబటి నారాయణ
నిర్మల్
9849326801