Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుజాత.పి.వి.ఎల్.,
7780153709
సైనిక్ పురి. సికిందరాబాద్
నిజాం దొరల
పెత్తం దారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన
తెలంగాణ ధీర వనిత..
కాయకష్టం చేసి పండించిన
పొలాన్ని కాజేయ వచ్చి
జులుం చూపిన నైజాం దురాహంకార చర్యలపై
రోకలి బండ ఆయుధంతో అపరకాళిలా
కదం తొక్కిన
వీర వనిత..
నలభై ఊర్లపై పడి
భూ దోపిడీ చేసిన విసునార్ దొర
ఆగడాలకు అడ్డుకట్ట వేసి,
తెగించి ఎదిరించి
ప్రజా పోరాటాలకు ప్రేరణగా నిలిచిన పోరు ఉద్యమ స్ఫూర్తిప్రదాత
నీ దొర నన్నేం చేయగలడురా..!
అంటూ గద్గద స్వరంతో
మాటల తూటాలతో దొరకే సవాల్ విసిరిన పూల వనంలో విరిసిన ఎర్ర వనిత..
ఎన్ని కష్టాలొచ్చినా..
ఎంత నష్టం వాటిల్లినా..
ఇసుమంతైనా చలించక
ఎర్రజెండా పట్టుకొని
దొరల దుశ్చర్యలను దునుమాడిన చాకలి ఐలమ్మ
పోరు బాటన నడచిన వీర వెలుగు కాగడా