Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంగనాధ్ దేశిరాజు
9703643447
మోనంవహించిన మాధుర్యమా!
మూగబోయిన
తీయని గళమా!
ఎన్నోరసమయ
రాగాలాలపించి
డస్సిపోయిన
రాగ హృదయమా!
భారత సినీ సంగీతాన్ని
మధురగళహీననుజేసి
అదృశ్యమైపోయావా
అమరగాయకా!
సరిగమలకే
కొత్తహోయలు కట్టబెట్టి
రాగాలకే సరాగాలునేర్పి
వయ్యారి నడకలు నేర్పి
సినీసంగీతానికే
ఓ బాణి ని ఏర్పరచి
పాటల తో
నర్తనమాడించిన
నవరాగాల సంకలనమా!
యువగాయకులెందరకో
స్పూర్తిదాయకమా
గానగంధర్వా!
కోట్లాది అభిమానుల్ని
శోక సముద్రంలో ముంచి
అమరుడవయ్యావా
బాలూ!
ఇదే మాఅశ్రునివాళి
నీకు.