Authorization
Wed April 09, 2025 03:09:17 pm
దత్తపుత్రుడా మాకు బంధుమిత్రుడా
రాజనీతిజ్ఞుడా అపర చాణక్యుడా
తెలుగు దేశం తొలి ప్రధానుడా బహుభాషాకోవీధుడా ఇండియన్ స్టాక్ మార్కెట్ సంపదకు మూలపురుషుడా కూలిపోతున్న భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన యోధుడా
భూస్వామ్య కుటుంబికుడా భూసంస్కరణలు అమలుచేసిన భూదేవి పుత్రుడా
జయం అనే కలానికి నామకరనుడా కాకతీయ పత్రిక ప్రారంభికుడా న్యాయశాస్త్రానికి స్వర్ణ పతకం అందుకున్న నీతజ్ణుడా
ముళ్ళకిరీటం అధిరోహించి ముళ్ళకంచెను తొలగించిన సైనికుడా
పేద ప్రజలకు భూతల్లిని పంచిన మహాత్ముడా
అఖిలభారత సభ్యుడా
ఆర్థిక సంస్కరణల పితామహుడా
అణు పరీక్షల కార్యక్రమం మొదలుపెట్టిన ప్రభుత్వ పాలకుడా
భారతభూమి నేలిన తొలి తెలుగు వీరుడా
పాములపర్తి వెంకట నరసింహుడా
ప్రతీ పౌరడికి నీవే మార్గదర్శకుడా
...దార్‌కు కవిత ఉమెన్స్ కోఠి , హైదరాబాద్
ఎమ్.ఎ తెలుగు లిటరేచర్