Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వకుళ వాసు, 9989198334
సినీ వినీలాకాశంలో జాబిలివై వెలిగి
నీ మధురగానామృత వెన్నెలజల్లులతో
ఎంతోమంది తారల జీవితాలలో
పున్నమి పూలు పూయించావు
నీమానసవీణ మధుగీతాలతో
ప్రేక్షకులమదిలో పులకింతల పొన్నలు పూయించి
తీరనిదాహాన్ని తీర్చ తీయని గానవర్షాన్ని కురిపించావు
ఏ ప్రేమవేధనా లేనివారిని సైతం
నీ ఊపిరి ఊయ్యాలతో
ఎదలో మూగసన్నాయి ఊదావు
అందుకే ఇప్పుడు మా ప్రాణాలు
నీకై చలివేణువులయ్యాయి
నీభక్తిరస గానామృతాలతో వెలుగుకు ఉదయాలనద్దావు
పాడుతా తీయగా అంటూ అందరి ఇళ్ళల్లో ఇంటోడివై
చెలిమికి హృదయాన్ని పరిచావు
నవరసాల పుప్పొడి జల్లులతో అందరి మనసులను తడిపావు
వేవేలపాటలతో శంకరుని నాదాభిషేకం చేసి
నీ ప్రాణాన్ని గానంగామలచి ఆనటరాజుచే ఆనందభైరవి ఆడించావు
ఆనగరాజధరుడిని అలుమేలుమంగతో నీపాటలతోటలో విహరింపజేసి
అలిసిసొలసితి నంటూ అంతర్యామిని శరణుజొచ్చి నీభారపు పగ్గాన్ని తెంపుకున్నావు
గంధర్వలోకాలనేల గానగంధర్వుడవై
మాఅందరి హృదయాలలో అమరుడవై దివికేగిన నీకివే అక్షరనీరాజనాలు