Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాపూజీ ముఖ చిత్రం .. అందరి హృదయాలలో ఉంది బద్రం
మొగము పైన చిద్విలాసం.. చిరునవ్వుల దరహాసం
అహింస అనేది నీ హస్ర్తం..తెల్లవాని గుండెల్లో అది గునపం
చైతన్య పు బావుటా.. కోట్ల హృదయాలలో నిలుపుట
పలికావు సత్యం.. చేశావు అందరికీ హితం
నడిపావు సత్యాగ్రహం.. లేదు నీకు ఆగ్రహం
భారతావని బానిస బతుకులు..నీ వల్ల అయ్యాయి విముక్తులు
అంటరాని వారు కారు.."హరి" జనులు వారు
శరీరానికి లేదు ముసుగు..మనసు మంచి కై పరుగు
విదేశీ వస్త్రాన్ని బహిష్కరించి.. స్వదేశీ వస్త్రాన్ని ఆదరించి
అహింసనీకురాచమార్గం.. స్వేచ్ఛ
శాంతి సత్య శోధనే దాని పరమార్థం
శాంతి పోరాట దీక్షతో.. స్వతంత్రులుగా చేసిన
జాతిపిత మహాత్మా ..రవికిరణం నీవై
శాంతి వెలుగును నింప..తరలిరావ మరల