Authorization
Mon Jan 19, 2015 06:51 pm
--వకుళ వాసు, హన్మకొండ
గానం మూగై
రొదబెడ్తాంది
సరిగమలతో ఆడించే
నాన్నలేడని
పాటలతోట
వల్లిపోయింది
స్వరాల జలం
ఇంకిపోయిందని
కోట్ల హృదయాలు
ఘొల్లుమన్నాయి
గాన గాంధర్వుడి
ఆయువు వాయువైందని
బాలు
అమరుడే
అందరి హృదయాలలో
నిత్యం పాటై మ్రోగుతూ
మధుగీతాల స్వరం
స్వేచ్ఛావాయువైంది
మళ్ళీ కొత్తగొంతుకై
పుట్టాలని