Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్ని అక్షరాలు జత కడితే
నీరూపం వస్తుంది..!!
ఎన్నిభావాలు వలికిస్తే
నీపాట జాలువారు..!!
కవిత్వానికి
అందనంత ఎత్తూలో
తత్వానికి చిక్కనంత
దూరంలోఉన్నావు...
అందరి ఆత్మీయతను
నీపాటలో పలికిస్తీవి..
వసంతం వచ్చిన రాకపొయిన
నిత్యం నీ పాట ఓ వసంతమే..!!
ఓ కొత్త చిగురుతో
మొలకెత్తుతావు..!!
కన్నీళ్లను నవ్వులో కలబోసి
కొత్తపాటను వినిపిస్తావు..!!
పసిపిల్లల ఏడ్పుకు
నీ పాటే ఓ జోలపాట..
సుప్రభాతంలా
సూర్యుని కంటే ముందే
నీ పాట లోకానికి
వినబడుతుంది..!!
కోడి కూతలా నీ పాట
పల్లెను నిద్రలేపుతుంది..!!
నీ స్వరం విన్న కోకిల
సిగ్గుపడుతుంది..
ఏమిటి ఈ వింత
అదే భావాల పులకింత..
ఎవరు పలుక లేరు ..
ఈ పలుకులు
ఎవరు పాడలేరు ఈ పాటలు
ఉరకలు వేస్తోంది నీపాట..!!
పరుగు తీయుస్తుంది..
నీ పాట జగమంత
చక్కర్లు కొడుతోంది..!!
నైవేద్యాలయి
అందరికి అందుతుంది..!!
నీ నోట వచ్చే ప్రతిపాట
అనురాగ అక్షరాలు..
ఇక రారు ఈ లోకానికి
నీ లాంటి గాయకుడు..
నడుస్తుంది నీ పాట
ప్రతి ఇంటిలో నిశ్శబ్దాన్ని నెట్టి
ఓ మధురశబ్దమై వినిపిస్తుంది
నీవో అమరగాయకుడివి
ఎప్పటికి చావులేదు...
నీ పాట ఓపక్షి దేశాలన్నీ తిరుగుతుంది..!!
పాటకు ప్రాణం పోశావు..
ఆ ప్రాణమే నీ ప్రాణమై నిలుపుతోంది..!!
ఎప్పటికి అజరామరణమే...
నీవు తరలివెళ్లినా..
నీ గళంలోంచి వచ్చిన పాటలు
పరుగులు తీస్తున్నాయి
ఇరులపై దొరిలీ
తరుల చుట్టూతిరిగి జరులైపారి..
ప్రతి ఊరి గడప తట్టి..
కోడై కూస్తోంది..!!
ఓ సుప్రభాతమై వినిపిస్తోంది..!!
- అంబటి నారాయణ
నిర్మల్
9849326801
28-9-2020