Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆ స్వరం అజరామర నవనీత సుమం..
భరతావని ముద్దుల గాన పిపాసి...
మహల్ చిత్ర గళంతో పురివిప్పిన నెమలీయం..
కష్టాల లోగిలి తన ఆస్తి ఆభరణమై..
దేశావనికే వన్నె గొంతుకైన భారతరత్నం..
ఆ గొంతుక ఓ మురిపాల మకరంధం..
అనార్కలికి సొగస్సులద్దిన స్వర పద్మభూషణం..
మధురిమతో ఫిల్మ్ ఫేర్ గ్రహీతవై..
శాస్త్రీయ సంగీత స్వర దిట్టవై..
భారత రత్న,పద్మవిభూషణ దివ్య డాక్టరేట్ వై..
వెలుగొందె దిగ్విజయ పరిమళ శోభితమై..
నెహ్రు గారి గుండెను తాకిన గాయకా..
అప్సర, కాళిదాస అవార్డ్ మళయమారుతివా..
ఎన్టీఆర్ జాతీయ అవార్డ్ విజేతవా..
విరామమెరుగని అపూర్వ గళ సమ్మోహనా
పుష్ప గాన కోకిల మా లతా మంగేష్కరమా
నీ సిరివెన్నెల నవవెలుగుల కాంతులగొంతుకకు
ఇవే అక్షర అభినందన జన్మదినశుభాకాంక్షలు..
- శ్రీమతి గద్దె అనంతలక్ష్మి
ప్రధానోపాధ్యాయని
నరసరావుపేట, గుంటూరు
8500988499