Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాటల గాన గంధర్వుడు
సంగీత స్వర మాంత్రికుడు
పాటకు ఖ్యాతి తెచ్చిన ఘనుడు
పాటల శ్రోతల అభిమానుడు
సినీ గాయకుడిగా ప్రస్థానం
ఎన్నో రికార్డులకు ఆస్థానం
శ్రోతల గుండెల్లో పదిలం నీ స్థానం
మరెవ్వరు పాడలేరు నీ గానం
మహమ్మారిగా కాటువేసే కరోనా
వదలకపోయే జయించినా
అభిమానులు పూజలెన్ని చేసినా
పట్టువిడవదాయే పాటై గర్జించినా
నీవు లేవన్న నిజాన్ని
మా చెవులు నమ్మలేకపోతున్నాయి
మీరు పాడిన పాటలే ఈ భూమిపై
సజీవంగా బతికే ఉంచుతాయి
- చెరుకు రామలింగం, సామజిక వేత్త
చిట్యాల , నల్లగొండ