Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కవిత్వమే తన ఆయుధంగా
దురాచారాలపై పోరాడిన 'సాహితీయోధుడు'
ఛీత్కారాలు ఎదుర్కొన్నచోటనే
సత్కారాలు పొందిన ఘనుడు
బాల్యం నుండే అవమానాలెదుర్కొన్నది నిజం
అందుకే తనకలవడెను తిరగబడే నైజం
శాశ్వత సామాజిక ప్రయోజనమాశించి
కవితాసాగు చేసిన 'ఖండకావ్య'రచయిత
చిన్ననాటి నుండే చిత్రకారుడు గాయకుడుగా
కళాహృదయాన్ని పెంచుకున్న ఉపాధ్యాయుడు
రెండో ప్రపంచయుద్ధ కాలాన ప్రచారకుడిగా
రేడియా కార్యక్రమనిర్మాతగా తనవి బహుపాత్రలు
"గబ్బిలం"చే విశ్వనాధునికి సందేశం పంపి
అంతరానితనాన్ని ఎత్తిచూపిన "కవికోకిల"
రాచరిక కాఠిన్యాన్ని చవిచూసిన ప్రాణత్యాగి
చారిత్రక 'పిరదౌసి' రచయితైన 'కళాప్రపూర్ణ'
విశేషమైన కావ్యరాజాలెన్నిటినో అందించిన
సాహితీసామ్రాజ్య *నవయుగ కవిచక్రవర్తి*
సమోన్నత'కేంద్రసాహిత్యఅకాడమీ అవార్డు స్వీకర్త
'శాసనమండలి సభ్యుడైన 'దళితవర్గ జ్వలన్మూర్తి'
కవి-రాజుల మధ్య భేధాన్ని హృద్యంగా చూపిన
'కవితా విశారదు'డైన నాస్తిక 'మధుర శ్రీనాథ"
'శ్మశానవాటిక'ను సమరసవేధికగా అభివర్ణించిన
నిత్య స్మరణీయ అక్షరసమరశీలి *గుర్రం జాషువ*
:వల్లాల విజయలక్ష్మి(టీచర్)
సిల్క్ నగర్..ఆలేరు(టౌన్)
యాదాద్రి భువనగిరి(జిల్లా)
9247397209