Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పల్నాటి పోరుగడ్డపై పరిమళించిన వినుకొండ
విశ్వనరోద్దక కవి దిగ్గజమా..
కష్టాల కడలిలో పేదరిక,కులమత జాడ్యాల మద్య
ఉదయించిన విద్యా ప్రవాహకమా..
తెలుగు సాహితీ పూదోటలో విరిసిన పద్మభూషణమా..
మూడాఛారాలపై కల ద్వజమెత్తిన కవికోకిలమా..
సమాజ వివక్షతకై అక్షరనిప్పులు జురిపిన గబ్బిలం
కావ్య కవీశ్వర కళాప్రపూర్ణకమా..
ఖండ కావ్య రచనలో అనర్గ సౌందర్యక కళాధిగ్గజమా..
చీత్కారాలే సత్కారాల దీవెనగా గాంచిన సృజనశీల
చిత్రకారికా, గాయకా, అక్షరకా, కవితా విశారదకమా ...
అణగారిన జాతి జన ఈతి బాధల కావ్య కధానికమా..
దళిత స్పృహలో అరిగిపోయిన అక్షరాలకు జీవమోసి
పద్యాలకు పదునెట్టిన కొత్తలోకం కావ్య సృష్టికమా..
ఓ నవయుగ కవి చక్రవర్తి నాట్యమాడిస్థివే
కత్తిలాంటి సిరాచుక్కలతో కడిగేస్థివె కవోష్ణ రుధిర వేదనలను..
శతావధాన దిగ్గజ చెళ్లపిళ్ల గారిచే గండపేరుండైన
ఫిరదౌసి రచనా సాహితీ విశిష్ట పురస్కారకమా..
సిగిరియా కుడ్యచిత్రాల ప్రతికృతుల చిత్రకమా..
సామాన్యుల భాషా పదాలే పద్య శిల్పాలుగా
వెలిగిన శబ్డ సౌందర్య విరాజితమా..
వడ గాల్పులు నా జీవితమైతే వెన్నెల నా కవిత్వమని పలికిన ఖండ కావ్య రారాజమా..
మా సత్కవీ మిత్రకా,సాహిత్య అకాడమి హృద్యమా..
నేటి సమాజ ఆదర్శ జనరంజక సాహిత్యక అపర బ్రహ్మ గుర్రంజాషువా
-శ్రీమతి గద్దె అనంతలక్ష్మి
ప్రధానోపాధ్యాయని
నరసరావుపేట,గుంటూరు
8500988499