Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉరికొయ్యలు చెరసాలలు
ఆపలేవు ఉద్యమాలను
నిరంకుశం నిర్బంధాలు
అడ్డుగోడలేం కావు
బానిస సంకెళ్లు త్రెంచ
స్వాతంత్ర సమరంలో
కొదమ సింగమై నిప్పు
కణికల్లా మాటల తూటాలు
పేల్చినా భగత్ సింగ్
ఈనాటికి ఎప్పటికి
క్రాంతి కాగడా నే
ఈ యువ నవతరానికి
అన్యాయాలను, అక్రమాలను
దోపిడిలా దొరతనాన్ని
ఎదురించి నిలబడే
గుండె నెత్తురు లో కొత్త
ఊపిరి పొసే రేపటి
వేగుచుక్కడతడు
సాగుదాం నవకవన
కిరీటిలమై భగత్ సింగ్
వారసులమై.. రేపటి
భవిష్యత్తు లో సమసమాజ
స్థాపనలో పిడుగులై
ఉరుముదాం .. ఇంక్విలాబ్
జిందాబాద్.. యని మెరుపులా
గర్జిస్తూ ఉక్కు పిడికిలతో
వారి అడుగు జాడల్లో
నవ భారత నిర్మాణ రథ సారధులమై
సమసమాజ స్థాపనకు
ఉరికొయ్యల్ని ముద్దాడిన
ఆ విప్లవ వీరుడి చెమట
చుక్కలమై పోరుసల్పుదాం.
- కొండా రవీందర్
9848408612.