Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సృష్టీలో ఇంత వికారం
ఎప్పుడు చూడనే లేదు
పాముల కన్న పాపత్ములు
పులుల కన్న కటినాత్ములు
మానవత్వం చచ్చిపోయిన ఈ వేళ
మనిషిలో ద్వేషాన్నిచూసి
పిశశాలు కూడ సిగ్గుపడుతున్నాయి,
మీరు పూజించే దేవుండ్లందరిది
వంద శాతం
ప్రేమ వివాహలేగా,,?
మీరు చేసే పూజలన్ని కపట నాటకలేనా ?
తల్లి దెయ్యమైతే ఆ భాధ వర్ణాతీతం
రాబుందువులు కూడ
తమ
పిల్లలను కపాడుతాయే కాని
ఇంత కిరాతంగా జీవచ్చావాలను చేయవు .
తన ఇష్టాలే చేల్లలని
తన పరువుకు బలి ఇవ్వవు
ఈ మనిషి రాచపుండులా
రసికారుతు రగిలిపోతున్నడే
వీళ్ళను ఏ జీవితో పొల్చిన,
వేదాలు ఇతిహాసలలో
ఉన్న ఉన్మాద పాత్రలతో
పొల్చిన ఆ పాత్రలు
సైతం హత్య చేసినంత
పాప పకిలమైతాము .
ధన మధమో కండ బలమో ,
నీచాతి నీచమైన పని
తమ పిల్లలను తానే
చంపె పాప కార్యాలు
ఎలా చేస్తున్నారు ?
రెక్కలోచ్చిన పిల్లలు
ఎగిరి పోతాయి
తనకు అందని ప్రేమను అందుకుంటాయి యుగయుగాలుగా ప్రేమ చిరంజీవి ...!
దాని ముందు అంత చిన్న జీవులే ,,,!
ఆ ప్రేమ లేకుంటే నీ ఉనికి ఎక్కడిది
ఆ ప్రేమనే తోడుంటే
మనిషికి మరో జన్మతో పనేంటి
మిమ్ముల సరిపోల్చలేని పదాలు నిఘంటవులో కూడ
ఉపమానమే దొరకదు సుమీ,,!--!
(హేమంత్ హత్య సందర్భంగా)
- డబ్బీకార్ సురేందర్
9618789598
8309878216