Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగుకవుల కవితాభారతి
వెలుగునింపిన రచనా సంస్కృతి
సాహితీప్రియుల మనోస్రవంతి
శారదాదేవికీదే నీరాజనాక్రాంతి!
నవయుగ కవితా రథసారథి
నిమ్నజాతుల ప్రగతికి వారధి
ఖండకావ్యాల రచనా పెన్నిధి
గురుతుగా నిలిచే జాషువా సన్నిధి!
పేదరికం కులమతాల భేదం
ఎదురించే శక్తి అతని వేదం
మరువలేని సాహితీ సుగంధం
మానవతా విలువల సంబంధం!
పిరదౌసి, గబ్బిలం కావ్యాల
కవితారస మాధుర్యాలు
తిరుగులేని జనజీవన
ప్రదర్శితా సౌందర్యాలు!
సమసమాజ నిర్మాణ ప్రగతి
సాధించాలన్నదే జాషువా ఆర్తి
అదే మనందరికీ అందిన సుకృతి
అందుకే అందిస్తున్నా
జాషువాకు అక్షరహారతి!
-- ఆళ్ల నాగేశ్వరరావు, తెనాలి
సెల్ నెంబర్.7416638823