Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోడిగూటి తిరుపతి
9573929493
త్యాగాల కేతనం ...
ఉద్యమాల కెరటం ...
విప్లవాల కరవాలం ...
అభ్యుదయ శిఖరం ...
ఆదర్శాల నిలయం ...
అతడే భరత వీర సింహం ...
బహదూర్ సాహిద్ భగత్ సింగ్
దేశ స్వాతంత్య్రం కోసం ...
ఉరి కొయ్యను ముద్దాడిన అమరుడు
లేత వయస్సులోనే…
తుపాకులు మొలిపించిన రణధీరుడు
పార్లమెంట్ నిండు సభలో ...
బాంబులు విసిరిన బహాదూరుడు
ఇంక్వీలాబ్ జిందాబాద్ నినాదాన్ని
నింగి నంట వినిపించినా విప్లవుడు
బ్రిటిషర్లకు వణుకు పుట్టించిన వీరుడు
జైలును రణ క్షేత్రంగా మలిచిన యోధుడు
మతవాదుల, మితవాదుల కాదంటూ
సామ్యవాదాన్ని విస్తరించిన దేశ భక్తుడు
స్వేచ్ఛ స్వాతంత్య్రం స్వప్నించినవాడు
సమ సమాజం కోసం పరితపించినవాడు
యువతలో విప్లవం రగిలించినవాడు
జాతిని పోరు బాటలో నడిపించినవాడు
అమర వీరుడు భగత్ సింగ్
విశాల భారత "కీర్తి" ప్రభాత
భావి తరాల "స్ఫూర్తి" ప్రదాత
ఆ జీవన ప్రస్థానం స్వల్పమే అయినా…
జన పెదాలపై చైతన్య పదమై పల్లవిస్తాడు
విశ్వ వీధిలో అఖండ "జ్యోతి"గా ప్రజ్వలిస్తాడు
భారత సింహం భగత్ సింగ్ కు. విప్లవ జోహార్...