Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆ.వె
తనదు మాటలింక వినలేమ మనమంత
తేనెలొలికె తెలుగు పలుకులందు
గళము మునందు నీయుగళ గీతములు రావ
తీపి గురుతులన్ని తేలిపోయె!
ఆ.వె
పరవశింప జేసె పాడుతా తీయగా
పల్లవించినారు పిల్లలంత
పనులు పూర్తి జేసి పడితి హడావిడి
కనుల నీరు జారె కలవరమున!
సీ.ప
నారద గాంధర్వ నరజన్మ నెత్తావు
నాదాలు నీనోట నాట్యమాడె
కనిపించవా నీవు కనికరమే లేద
ఆహ్లాదపరచెను హాస్యరసము
వీనుల విందుగా వినిపించదా పాట
రంగరించితినీవు సంగతులను
కరుణ రసముతోడ కన్నీరు తెప్పించి
మధుర స్మృతులు నేడు మాకు మిగిలె!
ఆ.వె
బాల సుబ్రమణ్య భాసించె భానుడై
వేల యేండ్లు గడచు కాలమందు
హృదయమందు బాధ అధరమొదిలె నవ్వు
మనసు మూగ బోయె మరలి రావ!
- బి.శశికళ, పాఠశాల సహాయకులు