Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెల్లుట్ల సునీత
7989470657
స్వాతంత్ర సమర యోధుడు
విప్లవాల వీరుడు
పోరాటాల చైతన్యం
వసివాడని పసిప్రాయంలో
తుపాకులు నాటిన
షాహిద్ భగత్ సింగ్
ఢిల్లీ వినువీధులలో
ఎర్ర కాగితాలు చల్లి
ప్రజలను చైతన్య పరిచిన విప్లవం
స్వాతంత్రోద్యమంలో పోరాడిన ఆయుధం
సామ్యవాద హక్కులకై
సమరమే చేసి
అహింసావాదం పై
అసంతృప్తి చెంది
విప్లవోద్యమంలో
పోరు సింహమై గర్జించే
గాంధీ సిద్ధాంతాలను అనుసరించి
బ్రిటిష్ దిగుమతులను
పుస్తకాలు దుస్తులు తగలబెట్టిన
మచ్చుతునక వ్యక్తిత్వం
తెల్ల దొరలకు వ్యతిరేకంగా
ప్రతీకారం తీర్చు టకై
ప్రతిమ పూనిన ఆ ప్రతిమ డు
ప్రజాహితం కోసం
కీర్తి కిసాన్ స్థాపించి
పార్లమెంట్ ముంగిట్లో
బాంబుల వర్షం కురిపించిన
అగ్గిపిడుగు
జైలు జీవితం గడిపి
నిరాహారదీక్ష సమరం సలిపి
స్వాతంత్ర్య సిద్ధికి పోరాడిన
దేశభక్తుడు భగత్ సింగ్
విప్లవ వీరుడు
రచన నెల్లుట్ల సునీత
కలం పేరు శ్రీరామ
ఊరు ఖమ్మం
చరవాణి 7989470657
సమసమాజ స్థాపనకు
ఉరికొయ్యల కౌగిలించుకొని
నేలకొరిగిన విప్లవ మందారం
భావితరాలకు స్ఫూర్తిగా
విప్లవ విజయకేతనం ఎగురవేసి
అమరుడైన వీరుడా..
తిరిగి రా మళ్లీ నువ్వు
ఉదయించే సూర్యుడు వై
అందుకో.... వీరుడా
ఎర్రని మందార కుసుమాల మాలలు
ఎర్ర సిరా తో లిఖించిన నా అక్షర నివాళులు.....!!
నీ జయంతి సందర్భంగా