Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జవేరియా
9849931255
భరతమాత ముద్దుబిడ్డ
భావితరాలకు వెలుగు బాట!
విప్లవం అతని నినాదం
తిరుగుబాటు అతని సిద్దాంతం!
మట్టిలో మొలకలకు
బదులు తన పిన్న వయసులో తుపాకులను మొలిపించినాడు
స్వేచ్చా స్వాతంత్ర్యముల కోసం పరితపించి ఉరికంభాన్ని ఆనందంగా ముద్దాడినాడు
పార్లమెంటు ప్రాంగణంలో
ప్రాణాలను లెక్కచేయకుండా
ప్రత్యర్థులపై బాంబుల వర్షాన్ని కురిపించినాడు
మితవాదాన్ని త్రోసి పుచ్చి
తనకిష్టమైన సామ్యవాదాన్ని మనస్పూర్తిగా స్వీకరించినాడు
ఇంక్విలాబ్... జిందాబాద్
నినాదాన్ని నలుదిక్కుల పిక్కటిల్లేలా పిడికిలి బిగించి నినదించినాడు
తెల్లదొరల గుండెల్లో
గుబులు రేపే రైళ్ళను పరుగెత్తింప జేసిన ఆ కొదుమ సింహం ఎవరో కాదు?
దేశభక్తిని తన అణువణువులో నింపుకొని మాతృదేశం కోసం ప్రాణత్యాగం చేసిన అసలు సిసలైన అమర వీరుడే మన భగత్ సింగ్!!