Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాళంగి.వసంత జెస్సన్,ఖమ్మం
9490967433
తొలి తెలుగు దళిత కవి…సందేశ కర్త…గబ్బిలం రచయిత…వినుకొండ వీరుడు
సువిశాల భారతంలో…కుల వివక్ష రాచపుండు
విద్వత్తుఎంత ఉన్నా…కులము తోనే విలువా
అదే జరిగింది…కోయిల పాట బాగా ఉన్నా…
అది దళిత కోయిలైతే…ఆ కోయిలే జాషువా
ప్రతిభకు గుర్తింపు లేని సాంఘిక పరిస్థితులు
పేదరికం సహనం నేర్పింది…
కులవివక్ష పోరాట పటిమను నేర్పింది…
జీవితం వడగాడ్పైనా…కవిత్వం వెన్నెల తెచ్చింది
పడిన చోటే వెతకాలన్న లక్ష్యంతో…
సాహసించి …పోరాడి …అలసి సొలసి
సీతాకోక చిలుకలా మారింది జాషువా జీవితం
ఎక్కడైతే అవమానాల పాలయ్యారో…అక్కడే
పల్లకిలో ఊరేగింపు…కళా ప్రపూర్ణ…పద్మ భూషణ