Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎందుకు మనమధ్య
దూరం పెరిగింది..??
ఎందుకు మనమధ్య
విబేధాలు ఏర్పడ్డాయి..??
అందరం..
ఈ నేల మీదనే ఉన్నాం..!!
అందరం ఈ గాలినే
పీల్చుకుంటున్నాం..!!
అందరం ప్రకృతి
వడిలోనే ఉన్నాం..!!
ఈ నేల మీద ఉన్న
ప్రతిదీ అందరిదీ..
ఏ కొందరిది కాదు..
మరి ఎందుకు ..
ఈ వాదాలు..ఈబేధాలు..??
మనం మనుషులం..!!
మనమధ్య
మానవత్వం తప్ప
వేరేది ఉండకూడదు..!!
మనం పుట్టక ముందే
నీరు, గాలి, నేల,
ప్రకృతి, పుట్టింది..
ముందు పుట్టిన
వీరికె లేదు కులం మతం..
అన్నీ కలిసి కట్టుగా...
మనకొరకె పనిచేస్తున్నాయి..
మన ప్రాణాలను
నిలబెట్టుచున్నాయి..!!
ఒక్కరిమీద ఆధార పడే
బతుకులు మనవి..
కులాలను సృష్టించుకొని..!!
మతాలను పుట్టించుకొని..!!
విభేదాలను ఏర్పడుచుకొని..!!
అందరికి దూరమై
బతుకుచున్నాం...
మానవత్వానికి లేదు కులం..!!
మంచితనానికి లేదు మతం..!!
మరి మనుషుల కెందుకు
ఈకులం ..మతం..??
ఒకరిమీద ఒకరం
ద్వేషాలు పెంచుకొని
దోషాలు బయట పెట్టుకొని
కుళ్ళు కుతంత్రంతో
మన మధ్య బలమైన
అడ్డుగోడలు పెట్టుకున్నాం..
అడ్డంగా వచ్చినవారిని
అద్వానంగా చూస్తోన్నాం..!!
ఈ కులం పీడను
వదిలించు కోవాలి..!!
ఈ మతం చీడను
నిర్మూలించు కోవాలి..!!
ఈ రెండు కలిసి..
మూలాల్ని తినేస్తోంది..!!
పునాదుల్ని కూల్చేస్తోంది..!!
మనషులుగా బతుక నీయదు
మనుషుల మధ్య
ద్వేషం పుట్టించి
కలహాలను సృష్టిస్తోంది..!!
చివరికి కన్నీళ్లను తెప్పిస్తోంది..!!
అందుకే వద్దు..వద్దు
కులం మతం
మనం అందరం.. కలిసి
ఉండడమే ముద్దు..!!
అంబటి నారాయణ
నిర్మల్
9849326801
29-9-2020