Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రకృతిని పూజించే పండుగ
ప్రకృతి వికసిత పూలతో
పవిత్రంగా పూజించే పండుగ
పదిమంది హితంకోరే పండుగ
భక్తి పార వశ్యంతో ఆరాధించే పండుగ
బతుకునిచ్చే బతుకమ్మ పండుగ!
తంగేడు పూలతో తనివితీరా
బంతిపూలతో బతుకును మాలగా చేసి
బతుకమ్మ కంఠంలో మాలగా చేసి
రకరకాల రంగుల కుసుమాలతో
సర్వజనుల క్షేమాన్ని కాంక్షిస్తూ
జరిపే ప్రజల పండుగ బతుకమ్మ!
మనసుకోరే మగడు కోసం కన్నెలు
ముతైదుతనం కై మహిళలు
చక్కని చదువుకోరకు పిల్లలు
బంగారు పంటలను ఆశిస్తూ కర్షకులు
సర్వజనుల సంక్షేమం కోసం
లోక కళ్యాణార్ధం అందరూ కలసి
అమ్మను పూజించే పర్వదినం
బతుకమ్మ పండుగ పుణ్యదినం
నిర్మల మనస్కులై ప్రార్ధిస్టే
వరించెను పుణ్యఫలం
కోరిన కోర్కెలు ఫలించెను!
- ఆళ్ల నాగేశ్వరరావు
నాజారుపేట, తెనాలి
7416638823