Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గోదారి గలగల చప్పుళ్ల
రాజమహేంద్రానివి
కృష్ణమ్మా పరుగులెడుతున్న
బెజవాడ కనకదుర్గమ్మా
గారాల పట్టివి
కొల్లేరు సరస్సు అందాల
కొల్లేటి పక్షుల..
కిలకిల రాగాన్నివి
వెంకన్న ఒడిలోని
ఆకాశగంగా.. స్వరాల
మాంత్రికుడివి
భాగ్యనగరి జనులు
మెచ్చిన చార్మినార్ ..
అద్దాల మేడలో
మేలిముత్యానివి
మంచితనమే..నీ
గానాల సరిగమలు..
సంగీత ప్రపంచానికి
ప్రాణా వాయువు
సరిలేరు నీకెవ్వరూ...
ఈ సంగీత జగతిలో
ఒదుడుతూ బతికే
అతి సామాన్య జీవితం
ఇన్ని పదులు వచ్చిన
తరగని నీ గానామృతం
తెలుగు భాషకే మకుటం
మళ్ళీ జన్మంటూ ఉంటే
ఈ తెలుగు తల్లీ ఒడిలో
మళ్ళీపుట్టాలి బాలు గారు
మరిచిపోము ఎప్పటికి
నీ పాటల సెలయేరులా
అలల ఆకాశాన్ని.