Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెల్లుట్ల సునీత
ఖమ్మం
7989460657
ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నాడు
తెలుగింటి ముంగిట్లో అందంగా వచ్చింది బతుకమ్మ
అధికార పేరుతో తెలంగాణపండుగగా
వేడుక అయి నిలిచింది బతుకమ్మ
సంబురాలన్ని అంబరాన్నంటీ పండుతులంతా జరుపుకొనగా
ప్రకృతిని పూజించే పండగేనంట
పెత్తందారీ తనం లో నలిగిపోయిన బతుకులు అంట
నవాబు చరిత్రలో ఆకృత్యాలను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారిని తలుచుకుంటూ
బతుకమ్మ అంటూ బతుకు అమ్మ అంటూ దీవిస్తూ ఉయ్యాల పాటల్లో ఉండే మర్మం
తొమ్మిది రోజులు తీరొక్క పేరుతో నవ నైవేద్యాలతో
తొమ్మిది రకాల పూలు తెచ్చి పేర్మి తో తొమ్మిది వరుసలు
తంగేడు తామర గునుగు గుమ్మడి గన్నేరు చేమంతి బంతి పూలు
రంగురంగుల పూలు రమ్యంగా పేర్చేరు బతుకమ్మను
పసుపు గౌరమ్మను కొలిచేరు మగువలంతా పట్టు చీరలు కట్టి
పడతులు అంతా వాడవాడలా ఊరేగింపు తో బంగారు బతుకమ్మను శిరస్సున ఎత్తుకొని
చెరువు కట్ట దగ్గరికి చేరుకుందురు
కలుషితమైన నీటి కుంటలు చెరువులు దివ్యమైన ఔషధాల రంగు పువ్వులతో శుభ్రపరిచేను నిమజ్జనంతో శాస్త్రీయత సాంప్రదాయం జానపదులలో..!