Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాకిటి రామ్ రెడ్డి
పులిగిల్ల ,వలిగొండ ,యదాద్రి భువనగిరి .
9000702093
గౌరమ్మను కొలువ ఘనమైన పండుగ
గంగామాత వద్ద జనమంతా ఉండగా
గళమెత్తి వనితలు పాటలే పాడగా
గంధర్వ దేవతలు దీవించే నిండుగా
తంగేడిపూలకు వనమంత తిరిగి
తీరొక్కపూలతో బతుకమ్మనుపేర్చి
తీపినైవేద్యం తిరువారాధముచేసి
తిరునాళ్ల వేడుకై తిరుగుతు ఆడేరు
పుట్టింటి బందం గంధమవ్వాలని
పుణ్యస్త్రీగాజన్మ ధన్యమవ్వాలని
ప్రేమతో తోబుట్టు పేరుగాంచాలని
పావనమైపూలకు ప్రణామాలుచేసిరి
శ్రీలక్మినీమహిమలు చిత్రమనితలిచి
సిరిసంపదలతో బతుకంత మలిచి
శాంభవి తల్లిని చప్పట్లతో కొలిచి
సంద్యాసమయానబతుకమ్మలాడిరి
దేశ విదేశాల్లో లేనట్టి పండుగా
తెలంగాణలోనే కనిపించే నిండుగా
కంజాత పుష్పాలు కరుణచూపంగా
కాంతలందరుకరము జోడించిఆడిరి