Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తంగెళ్ళపల్లి ఆనందాచారి
9848683377
నీ సుఖ సంతోషాల కోసమే
నా హృదయాన్ని నీకిచ్చాను
నీతో జీవితాంతం ఉండాలని
కానీ నువ్వేం చేసావ్...
ఏరోజూ నన్ను పట్టించుకోలేదు
నా మంచీ చెడులు చూడలేదు
నాకోసం నాలుగడులూ నడవలేదు
ఇంట్లో కాస్త పనన్నా చేయవు
నాకు నచ్చే భోజనం నువ్వు తినలేదు
రంగులు చూసి పొంగిపోతావు
జిహ్వ రుచి కోసం నాకు పేచీ తెస్తావ్
బండ్లు కార్లలో తిరుగుతావు
ప్రతిరోజూ సంపాదన కోసం పరుగులే
నన్ను ఎంతగా ఒత్తిడికి గురి చేస్తావో
ఎప్పుడు పడుకుంటావా అని ఎదురు చూస్తాను
సెల్ ఫోన్లో రాత్రంతా గడుపుతావు
పొద్దెక్కితేగానీ బద్దకాన్ని వీడవు
పచ్చని పొలాల్ని చూస్తూ సేదతీరాలని
వెచ్చని జ్ఞాపకాల్ని గుర్తు చేసుకోవాలని
నాకెంతగానో ఉంటుంది...
కానీ నువ్వు ఏరోజూ నన్ను పట్టించుకోలేదు
ఆప్పుడప్పుడు నా ఇబ్బందిని బీపీ లేసి చెప్పినా
అప్పటికప్పుడు విరుగుడేదో చూపి పరిగెడతావు
నీ గురించే నా బాధంతా
నీకేమైనా ఐతే నేనుండగలనా
అంతకన్నా ఒక్క క్షణం ముందే నేను చచ్చిపోతా...
ఓ నా దేహమా జాగ్రత్త...