Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-బత్తుల శ్రీనివాసులు
9985520404
ఇంకానా ...వివక్షత
ఇకపై చెల్లదు
పిల్లి .... ఎలుక
రెండూ సమానమే
రెండింటికీ
సమాన స్వేచ్చా స్వాతంత్ర్యాల్ని ప్రసాదిస్తున్నాను
ఎవరు ఎవరినైనా తినవచ్చు
పైగా అగ్ర తాంబూలం ఎలుక కే
ఎలుకా రా !
తరాలుగా
నీపై
పిల్లి జాతి జరిపిన హింసాకాండకు
కసి తీరా బదులు
తీర్చుకుందువు గాని
రా ! ఎ లు కా రా !
తొలి అవకాశం మీకే యిస్తున్నా
దేశం లోని ఎ లుక లన్నింటి కి
స్వేచ్ఛ నిస్తున్నా ఏ ఎలుక అయినా సరే
దేశంలోని ఏ పిల్లి నైనా తినవచ్చు
యిచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవటం లో
ఎలుక లు విఫలమైతేనే
ఆ తర్వాతి అవకాశం పిల్లుల కిస్తాను
ఎలుక జాతి శత్రువు లు
ఎంతగా విమర్శించినా
ఎనక్కి తగ్గేది లేదు
ఎందుకంటే
ఎంతైనా నేను
ఎలుక జాతి పక్ష పాతిని కదా
(నూతన వ్యవసాయ బిల్లుకు స్పందనగా)