Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బి. శశికళ, పాఠశాల సహాయకులు, బారువ
సీ. ప
కానరాని కరోన కష్టాలు దెచ్చెను
కటిక చీకటినిండ కమ్ముకొనెను
నేటి నిరుద్యోగి నిట్టూర్పు విడిచెను
బడిపంతులు బతుకు భారమయ్యె
బడి పంతులూ నీకు బతుకు తెరువు యేది
ఆదుకొనరెవరు అలుసుజేయు
నిలువ నీడయె లేదు నేటి విద్యా వంత
పొట్ట కూటి కొఱకు పోరునీది!
ఆ. వె
కృష్ణుడాదుకొనెను కృంగు కుచేలుని
కొరత లేక దీర్చె కోర్కెలన్ని
కలుగు సిరులు నీకు యిల నాగ పీరయ్య
ఆత్మ బంధువయ్యి ఆదుకొనెను!
సీ. ప
చేతనెముక లేక చేశావు సాయమ్ము
నిరతమ్ము భాగ్యమ్ము నీదు యింట
నడిచి సంపదలొచ్చె పిడికెడటుకులతో
కడుకీర్తి కలగాలి కలిమి పొంది
సూర్యునీ తేజస్సు శుక్ల పక్షపు చంద్ర
శోభించ వలె మీరు శుభము తోడ
కర్ణ శిబి దధీచి కలకాలమున కీర్తి
శక్తు ప్రస్తుని వోలె శక్తి వంత !
ఆ.వె
పాడి పంటలిచ్చి వీడదూ శ్రీలక్ష్మి
తరగనన్ని సిరులు వరములిచ్చు
పిల్ల, పాపతోడ చల్లగా వర్ధిల్లు
వెల్లి విరియగలవు వేయి యేండ్లు!