Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బి. శశికళ, పాఠశాల సహాయకులు, బారువ
ఆ.వె
ఒక్కగోవు నిల్చెనొంటి పాదంబున
ధర్మ దేవతేను దైన్యముగను
కాలితోడ దన్నె కలిపురుషుండంత
ఉత్తరాదనయుడు యుగ్రుడయ్యె!
ఆ.వె.
ఒంటి పాదమైన యుండదు ధర్మంబు
యోర్వ నేను యంటు యురిమి జూసి
కలిపురుషుడనేను కలియుగంబే నాది
కలను ధర్మమైన కలుగనీయ!
ఆ.వె.
నాదురాజ్యమందు నాల్గు పాదమ్ముల
నిల్చు ధర్మమెపుడు నీవు పొమ్ము
నిన్ను చంపివేతు నేననీ యారాజు
కలిపురుషుని పైన కత్తి దూసె!
ఆ.వె.
ఖడ్గమెత్తి కలిని ఖండించ బోయెను
వేడుకొనియె యతడు విష్ణురాతు
చోటు నీకు నేను జూపించెదననుచు
కనికరించి రాజు కలినిబంపె!