Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆ.వె.
స్త్రీ వ్యసనము యున్న సిగ్గు మాలినదౌను
ప్రాణి హింస పరమ పాతకంబు
మద్య పానమున్న మర్యాద జెడిపోవు
జూదమాడ జెఱచు జీవితంబు!
ఆ.వె.
నాదు రాజ్యమందు నాల్గు పాదమ్ముల
నడుచు ధర్మ మనుచు నతడు నవ్వె
నివియె నాల్గు జోట్ల నీవుండు మనుచును
నతడు ధర్మ పాలనంబు జేసె!
ఆ.వె.
ధర్మ వంతు డయ్యె ధర్మజ్ఞుడారాజు
ధర్మమునకు ప్రజలు దాసులయ్యె
ధైర్య హీనుడయ్యె ధర్మమునకు కలీ
ధర్మ దేవతేను ధైర్యమొందె!
ఆ.వె.
ప్రజల ప్రేమబొందె పరిపాలకుండంత
పగలు రాత్రి జేసె ప్రజల సేవ
ప్రాణమయ్యె ప్రజలు పాలకునికినంత
పరిమళించె యతడి పాలనంబు!