Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శశికళ.బి
ఆ.వె.
ద్రావ నీరు లేక దల్లడిల్లిన రాజు
దప్పికై వెడలెను దైన్యముగను
ద్రష్టయై వెదకెను దాపునందు విభుడు
ధ్యానమందు నున్న దపసినడిగె!
ఆ. వె.
యోగ నిద్రనుండె యోగి సమీకుండు
యుగ్ర రూపుడయ్యె యుర్వి ఱేడు
యూరకున్న యోగినుర్వీశు జూచెను
విసరె యురగమొకటి విసురుగాను!
ఆ. వె.
తండ్రి శిరము బాము దనయుండు జూసెను
శృంగి శాపమిచ్చె కృంగిపోయి
పాముకాటు చేత ప్రాణాలు కోల్పోవు
ఏడు దినములనిది వేయువాడు!
ఆ.వె.
పరమ యోగి కబురు ప్రభువందు కొనగానె
పద్మ రాగమయ్యె ప్రభువు ముఖము
పరుగు పరుగుమంటు ప్రభువు కొమరుడొచ్చె
పట్టము గట్టి సుతుని ప్రభువు జేసె!
ఆ.వె.
యోగనిద్ర లేచె యోగి శమీకుండు
కొమరు మాట దెలిసి కుమిలిపోయె
మందలించె సుతుని మందబుద్ధి దెలిసి
కబురు జేసె తపసి కరుణతోడ!
ఆ.వె.
పరమయోగి కబురు ప్రభువందుకొనగానె
పద్మరాగమయ్యె ప్రభువు ముఖము
పరుగు పరుగుమంటు ప్రభువు పుత్రుడువచ్చె
ప్రజల కొఱకు సుతుని ప్రభువుజేసె!