Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీ.ప.
శీఘ్రముగా రాజు శిష్ఠులను బిలిచి
శాస్త్రాది విషయాలు జక్కజేసె
జంచల మనసయ్యె జచ్చిన యురగమ్ము
జనులు కన్నీటిని జార్చిరపుడు
ఇంద్రియాలాటయే యింతజేటును జేసె
జాగు లేక సెలవు జనులగోరె
జ్ఞాన మార్గమునెంచి జాహ్నవీ నదికేగి
జీవాత్మను జయించి జియ్యరయ్యె!
ఆ.వె.
ఏడు దినమునాడు వీడు జీవుడిహము
జీవితేచ్ఛ బోయి జీవుడుండె
జూడవచ్చె శుకుడు జూస్తుండ జనులంత
వేడుకొనియె శుకుని విష్ణురాతు !
- శశికళ.బి