Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మీ నమ్మకం..వదులుకొని
ఎవరికో.. అమ్ముడు పోతున్నారు..!!
వాళ్ళు పెట్టిన.. గడ్డి తింటారు..!!
మీ.. మీద మీకే నమ్మకం లేకుండ చేసి
అసహ్యం.. పుట్టిస్తారు..!!
వీధివీధిన దిష్టిబొమ్మగా
నిలబెట్టుతారు..!!
పిచ్చొళ్లను చేసి
వెర్రోళ్లనుగ మలిచి ఆడిస్తారు..!!
పెద్దోళ్లను గౌరవించాలి అంటారు..??
కానీ.. పేదోళ్ళను తమ
పాదాల కింద.. నలిపిస్తోన్నారు..!!
పేదోళ్ళంటేనే వారికి
పాములు జెర్రిలు
పాకినట్లుగా.. ఉంటుంది..!!
ఎన్నిరోజులని వాళ్ళ జండాలను మోస్తారు..!!
మీకున్న ఎజెండాను వదిలేసుకొని
కుక్కకు బొక్క ఆశ చూపినట్లు చూపి
శ్రమనంత దోచేస్తోన్నారు..!!
అప్పుల బాధతో మీరు చస్తే
వాళ్ళు అంతస్తులు కడుతోన్నారు..!!
ఇది అనాది నుండి వీడని శిక్ష..!!
ఈ విదంగానే..ఉంది
తరతరాల మీ తలరాత
తగులబడి పోతోంది..!!
బతుకంతా బుగ్గిపాలవుతోంది..!!
వాళ్ళను జీవితములో
గెలిపించడానికి
మీరు నిత్యం మీ జీవితాలను
బలి చేసుకుంటున్నారు..!!
నిలువ నీడలేకుండా
చేసుకొంటారు..!!
మాదే విజ్ఞతని అని
సంతోషించకండి
మీ అజ్ఞానాన్ని
చూస్తే నవ్వొస్తోంది..!!
మీరు ఎవరికి బానిస కాదు..
మీ నమ్మకం మీదే..!!
ఎవరికి తలవంచొద్దు..!!
బతుకు శూన్యంలోకి పోతుంది..!!
అది మరిచిపోతున్నారు..!!
మీ కండలన్ని కర్రిగించుకొని..
ఎత్తుకు ఎదిగిపోతున్నారు..
ఎన్నెన్నో రాత్రులు
వాళ్ళ ఇంటిముందే
జాగారం చేస్తనే ఉన్నారు..
వాళ్ళ ఒత్తిళ్లకు
మీ ప్రాణాలు
కొట్టు మిట్టాదుతున్నాయి
వాళ్లచేతలో మోసపోయి దగాపడిన
అభాగ్యులు మీరు
నోటు చూపి
నోట్లోమట్టి కొడుతున్నారు
జాగ్రత్త పడండి...
సమాజంలో జరుగుతున్న
నిజాలను తెలుసుకోండి..!!
అంబటి నారాయణ
నిర్మల్
9849326801
1-10-2020