Authorization
Thu April 10, 2025 02:31:55 am
-- ఆళ్ల నాగేశ్వరరావు
నాజారుపేట, తెనాలి
సెల్ నెంబర్.7416638823
ముత్యాలూ వస్తావా
అడిగింది ఇస్తావా అంటూ
మురిపెంగా అడిగిన అల్లు....
ఆయన నటనతో కురిపించాడు
ప్రేక్షకులపై హాస్యపు జల్లు....
హస్యానికే భాష్యం చెప్పి
తెలుగు ప్రేక్షకుల హృదిలో
సుస్థిర స్థానం పొందిన అల్లు....
మెగాస్టార్కెకు మామయై
అల్లు అరవిందుకు తండ్రియై
మెగా ఫామిలీ కి అండదండయై
సినీ పరిశ్రమకు గాడ్ ఫాథర్ యై
విశిష్ట పాత్రలను పోషించిన అల్లు....
వెయ్యికి పైగా చిత్రాల్లో నటించి
విభిన్న నవరసాల పాత్రలను పోషించిన
మీరు
హాస్యప్రియులను అలరించడంలో
మీకు మీరే సాటి
ఇప్పటికి, ఎప్పటికి లేదు మీకు పోటీ
అందుకోండి మా నివాళులు ఘనాపాటి!