Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అహింస అనే ఆయుధంతో.. తెల్ల దొరలను పారద్రోలి
నల్లమందు రైతుల తరపున.. పోరాటం జరిపి
అంటరాని వారిని..'హరి'జనులుగా పిలిచి
శాంతి సత్యాల బావుటా ఎగురవేసి
అన్ని వర్గాలను.. సమానంగా చూసి
విదేశీ వస్త్రాన్ని బహిష్కరించి.. స్వదేశీ నేతను ఆదరించి
నల్లవాడు అన్న తెల్లవాని మెగము ..నల్లన జేసి
పాద యాత్రతో..ఉప్పు సత్యాగ్రహం చేపట్టి
బానిస బాధలనుండి ..విముక్తులను చేసి
భారతావనికి స్వాతంత్ర్య తెచ్చిన నీ ఘనత .. వ్యాపించెను ఎల్లలు దాటి
ముందు తరాలకు మార్గదర్శకుడవు
అహింస తో..ఆక్రమించిన అవనిని
దక్కించుకున్నావు
అదే అహింస తో హింసను అంతమొందించ
మళ్ళీ పుట్టాలి బాపూజీ..రవి కిరణమై వెలుగు పంచాలి
శాంతి సత్యం వైపు మళ్ళీ పరుగు పెట్టాలి
- దార్‌కు కవిత (ఎం.ఎ తెలుగు)
ఉమెన్స్ కోఠి, హైదరాబాద్
చరవాణి:6281950150