Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆఫీసు నుండి ఆదుర్దగా వచ్చిన సిద్దు తలపట్టుకుని విసుగ్గా సోఫాలో వాలిపోయాడు. ఏడుస్తూ తన దగ్గరకు వచ్చిన శ్రేయను సిద్దు దూరంగా నెట్టాడు. నితిన్ ఉరుక్కుంటూ వచ్చి చెల్లిని ఇంకా ఆటపట్టిస్తూనే ఉన్నాడు. ఇదంతా గమనించిన పావని నా ఖర్మ ఇంతే వెట్టిచాకిరితోనే ఒళ్లుహూనం అవుతుందని లోలోన గొణుక్కుంటూ సరసరా బెడ్ రూంలోకి వెళ్లింది.
రూం లోకి వచ్చిన సిద్దును కనీసం గమనించకుండానే ఫోన్ లో స్నేహితులతో చాటింగు చేయడం చూసి సిద్దు "అనవసరంగా పెళ్లిచేసుకున్నాను" నిన్ను. నీ మాట విని కష్టాల ఊబిలో ఇరుక్కున్నాని తిట్టాడు భార్యని. మాట మాట పెరిగి భార్యాభర్తల మధ్య లొల్లి చిలికిచిలికి గాలివానయ్యింది.
అమ్మనాన్నల కోపతాపాలను చూస్తూ పిల్లలిద్దరు భయంతో వణకడం ప్రారంభించారు.
అన్నయ్యా! ఎంచక్కా మన పల్లెటూళ్లో ఉంటే నానమ్మ పూటకొక వంటకం చేసిపెడుతూ కొసరికొసరి గోరుముద్దలు పెట్టేది. తాతయ్యేమో సైకిల్ పై ఎక్కించుకుని రయ్ రయ్ మని పొలాలు...సంతలూ తిప్పుతూ బొమ్మలు కొనిచ్చేవాడు. ఇక్కడ అమ్మకు నాన్నకు ఇద్దరికీ మనం బరువైపోయాం రా...అన్నది శ్రేయ బాధగా .
సిద్దుకు ఉద్యోగం వచ్చిన కొత్తలో పట్నానికి రోజుపోయి వస్తానని అంటే పావని వేరుకాపురం పెట్టేదాక గొడవలతో హృదయాన్ని రంపపు కోత కోసింది. పల్లెటూల్లో టైంపాస్ కావడం లేదని ఆ మట్టిమనుషుల మధ్య నెగలలేనని రోజు పోరు పెట్టి పట్నంలో కాపురం పెట్టించింది. కంపెనీకి లాస్ రావడం పని ఒత్తిడి పెరగడంతో సిద్దు అతి కోపానికి గరయ్యాడు. సహనం లేని పావని భర్త మీద కోపాన్ని పిల్లలపై తీసి వారి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది.
అప్పుడే ఫోన్ రింగవడంతో శ్రేయ ఫోన్ ఎత్తి "పండుగకు రమ్మని" పిలిచిన నానమ్మతో ఏడుస్తూ "ఇంట్లో పరిస్థితి అంతా వివరిస్తుంది". తండ్రి తో ఊరికి వెళదామని పట్టుబట్టడంతో కుటుంబం అంతా పల్లెటూరికి ఊరికివెళ్లారు.
"చల్లని గాలులు హాయినిస్తుంటే ఇరుగుపొరుగువారి ప్రేమాభిమానాలను మదిని తడుముతుంటే" పావనికి ఉమ్మడి కుటుంబాల ఆదరణ...పెద్దల విలువ తెలిసివచ్చింది. ఇన్నాళ్లు "మూర్ఖత్వంతో తనేం కోల్పోయిందో" అర్థం అయ్యింది.
కృతజ్ఞతతో మామయ్య పాదాలపై పడి చేసిన తప్పును క్షమించి మమ్మల్ని చేరదీయమని వేడుకుంది. అది చూసిన పిల్లల ఆనందానికి అవధుల్లేవు. ఇద్దరు పిల్లలు అమాంతం తల్లిని వాటేసుకోగానే పావని హృదయం పులకరించిన సమమై విచ్చుకుంది.
"అర్థం చేసుకుంటే అనుబంధాలన్నీ తీయగానే ఉంటాయి. అపార్థాలకు చోటిస్తే చేదై మనుషులను విడగొడతాయి"
- అయిత అనిత
8985348424
జగిత్యాల