Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎవరన్నారు మేము వృద్ధులమని
వార్దక్యం శరీరానికే కాని మనసుకి కాదు
రిటైర్ మెంట్ ఉద్యోగాల వయసుకే ..!
ఇప్పుడే మొదలయ్యింది చిన్నతనం
ఆనాడు తీరని చిలిపి ఆటలు పాటలు
పోటీలు నేర్చుకోడాలు ఈమధ్యేగా మొదలయింది
‘పెద్దతనం, నీకు చాతకాదు,ఏమీ రాదు,
కృష్ణా రామా అనుకో, పుణ్యం తెచ్చుకో,
ఒడిపోతావ్! గెలుపు లేదు’ అని
నెగిటివ్ పదాలతో గుచ్చుతుంటే
వయసుకి మర్యాద ఇవ్వకుండా
కనీసం పలకరింపు లేకుండా పురుగుల్లా చూస్తుంటే
ఎక్కడుంది మానవత్వం
రవీంద్రనాద్ అరువది ఏళ్ల తరువాతే కదా చిత్రలేఖనం మొదలు పెట్టింది
మహాత్మా గాంధీ దండి మార్చి అంటూ 61 ఏళ్ల వయసులో 380 కి. మీ. నడివలేదా!
డొరిస్ హడ్డాక్ (Doris Haddock) తన 89 ఏళ్ల వయసులో 5,150 కిలోమీటర్లు నడిచి రికార్డ్ సాధించ లేదా.!
మదర్ థెరిస్సా నోబెల్ పీస్ బహుమతిని 69 ఏళ్ల వయసులో అందుకొనలేదా
‘గ్రాండ్ మా మోసేస్’ (101)పెయింటింగ్ వేయటం మొదలు పెట్టింది డెబ్భైఆరేళ్ళ వయసులోనే కదా!.
ఇలా ఎందరో తమ జీవితాలలో అసాధ్యాలు సుసాధ్యాలు చేసింది
మలి వయసులో కాదా!
పెద్దల మాట చద్ది మూట అనే సూక్తి వినలేదా!
చేయి చేయి కలిపితే సంఘటిత శక్తి మాదేగా!
మేము ధన కనక వస్తువులు కొరముగా
మాకు చిన్న పలకరింపు, ఆత్మీయతలే చాలు!
మాకూ కాలెండర్ లో ఒక రోజు వుంది
అదే అంతర్జాతీయం సీనియర్ సిటిజన్స్ డే !
పాటలు ఆటలు నృత్యాలు కథలు కవితలు
అంతా కోలాహలంగా పూర్తి ఆనందంతో గడిపే రోజు అదే ..
నేటి కోవిడ్ విజృంభిస్తున్న మరణ మృదంగ వేటలో
ఇంటి పట్టునే వుండి దొరకకుండా ప్రాణాలు కాపాడుకుంటూ
వీడియోలలో ఆత్మీయులను కలుస్తున్నాం!
చీటికి మాటికి వైద్యులు ఆసుపత్రులు చెకింగ్ లు లేవు..
కరోనా అంతమయ్యే రోజు దగ్గరలోనే వుందనే నమ్మకం
మళ్ళీ పూర్వపు నగర సందడి కోలాహలం త్వరలోనే వస్తుందనే ఆశ ..
మనసుకి ఏ అడ్డం లేని మేము మరెన్నో విజయాలు సాధిస్తాం ..
విజేతలైన పెద్దల స్ఫూర్తే మాకు బలం
వారి బాటలో నడిచి మరెంతమందికో మార్గదర్శకులవుతాం ..
- మణి కొపల్లె
9703044410