Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుజాత. పి .వి.ఎల్.
సైనిక్ పురి, సికిందరాబాద్.
మౌనం
బద్దలైతే బావుణ్ణనిపిస్తోంది..
ఒక్కసారి ఆకాశం
విరుచుకు పడితే ఎంతో
బావుణ్ణనిపిస్తోంది..
రాళ్ళలో ఉన్న నీళ్లన్నీ
పొంగి పొర్లి కామాంధుల్ని
ముంచెత్తేస్తే
ఇంకా బావుణ్ణనిపిస్తోంది ..
ఛీ ..సిగ్గనిపించట్లేదూ ?!
మగాళ్లా ? మృగాలా ?
అబలల పాలిట
మృత్యువులా!?..
అమ్మకు పుట్టామని
చెప్పుకోవటానికి
అసహ్యమనిపించట్లేదూ !?
ఇలాంటి నీచుల్ని చూసి
మృగాలు కూడా
తలదించుకుంటున్నాయి..
ఎందుకో తెలుసా !
వాటితో పోల్చినందుకు ..
చట్టాలెన్నొచ్చినా, ఎన్ని శిక్షలు విధించినా
మీలో మార్పురాదా ?
ఇక చెయ్యాల్సింది ఒక్కటే...
నరకంలో శిక్షలన్నీ
బతికుండగానే వేసెయ్యాలి ..
నడి బజారులో నిలబెట్టి
మంటల్లో తోసెయ్యాలి ..
ప్రాణం ఉండగానే శవ పరీక్షలు చేసెయ్యాలి ..
మీ కామ జ్వాలలు చల్లారక ముందే
దహన సంస్కారాలు
చెయ్యాలి ..!అప్పుడైనా బుద్దొస్తుందేమో వేచి చూడాలి ..!!