Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కవి ఓ అద్భుత శిల్పి
ఊహాల్లొ తన
కలమనే ఉల్లితో
అందమైన ..
తనకు అనుకూలమైన
భావాలను చెక్కుతాడు..!!
పదాలను మలిచి
భావాలతో పేల్చుతాడు..!!
కవి చేక్కిన ప్రతిపదం
ఓ ఆణిముత్యం..
అందుకే కవి ఓ చారిత్రక శిల్పి..!!
చిక్కని సారాన్ని
చక్కగా వివరిస్తాడు..!!
ఎన్నో సంఘటనల
సారాంశాన్నికి పురుడుపోస్తాడు..!!
చెత్తలోకి నూకేసిన
సత్యాన్ని నిలుపుతాడు..!!
హృదయంతో తాకి..
మనసుతో మీటితే..
కొత్త కొత్త ఆలోచనలు
ఉబికి వస్తాయి..!!
అబ్బుర పరిచే ఓ కొత్త భావం
బయటికి వస్తుంది..!!
కవి అలవోకగా సామాజిక
అంశాలను ఒలిచి చూపగలడు..!!
కవిది నిష్పాక్షిక విధానం
కవి దూరణి సందులేదు
అతడో అంతర్యామి
అంతా తడిమిచూస్తాడు..!
ఎవరికి కనిపించని
పొరలోకి చొచ్చుకు పోతాడు..!!
కవి వ్యక్తిత్వాన్ని
అంచనా వేయలేం
ఆయన తత్వం..
అతని వ్యక్తిత్వం
సమాజానికి ఆదర్శం..!!
అహర్నిశలు
అందరితో మమేకమై
శ్రమిస్తాడు..!!
చైతన్యాన్ని నింపుతాడు..!!
కవి అలసిపోతే
కాలం ఆగిపోతోంది..!!
అతడో నిరంతర ప్రయాణికుడు..
అనునిత్యం అన్వేషకుడు..
కవిత్వమై జీవిస్తాడు..!!
సమాజంలోని
అంతరాత్మను వ్యక్తికరిస్తాడు..!!
కవిలేని చోట కారు చీకట్లే..!!
అంబటి నారాయణ
నిర్మల్
9849326801
మీ అందరి ప్రేరణతో..ఆత్మీయతతో రోజుకోకవితగా..నాలుగు వందల(400) కవితలు రాయడం జరిగింది..ఇక ఈ ప్రవాహం ఇంతటితో
ఆగిపోతుంది.ఇన్నిరోజులు..నా కవితలతో మీ అందరిని బాధపెట్టినందుకు క్షమించలరు. మీ ఆత్మీయత..అనురాగం..ఎప్పటికి ఇలాగే ఉండాలని
పేరుపేరునా మీ అందరిని కోరుకొంటున్నాను..ధన్యవాదాలు..మీ..అంబటి..నిర్మల్