Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంగబలం ఆయుధబలంతో
తిరుగులేని శక్తిగా దేశంలో
పాదుకొన్న బ్రిటీష్ సామ్రాజ్యవాదుల్ని
సత్యశిఖరంపై అహింస
కంచుకోట కట్టుకున్న ఓ
గోచిపాత రాయుడు చత్వారం
కళ్ళద్దాలు ఊతకర్ర పట్టుకుని
ప్రజల గుండెల్లో తిష్టేసుక్కూర్చుని
వలసవాదుల వెన్నులో
చలి పుట్టించాడు !
విభజించబడ్డ శక్తుల్ని ఏకీకృతం
చేసి.. వంచించబడ్డ బతుకుల్ని
పునరుత్తేజపర్చి లక్ష్యాన్ని నిర్ధేశించేడు
ఆ మృదుమధుర భాషణం ముందు..
సామ్రాజ్యవాదుల తిరకాసువాదం
వీగిపోయింది
ఆత్మనిర్భరత ముందు అహంభావం
తలవంచింది
ఆ బోసినవ్వుల్లోంచి స్వేచ్ఛా సమ
భావనలు తళుక్కున మెరిశాయి..
---- భీమవరపు పురుషోత్తం
సెల్ 9949800253